అంగన్​వాడీలో చిన్నారులకు అన్నప్రాసన

రామకృష్ణాపూర్​ పట్టణంలోని కాకతీయ కాలనీ అంగన్​వాడీ కేంద్రంలో కమ్యూనిటీ బేస్డ్​ ఈవెంట్స్ లో భాగంగా శుక్రవారం చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి ఆరు నెలల  పాటు తల్లిపాల ప్రాముఖ్యత, బిడ్డకు 6 నెలలు నిండిన తర్వాత అనుబంధ ఆహార అవసరం పై తల్లులు, గర్బిణులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్​వైజర్ వేముల సరిత, అంగన్వాడీ టీచర్ విక్టోరియా రాణి తదితరులు పాల్గొన్నారు.