అన్నపురెడ్డిపల్లి మండలంలో మిషన్​భగీరథ రావట్లేదని రోడ్డెక్కిన్రు

అన్నపురెడ్డిపల్లి, వెలుగు : నాలుగు రోజులుగా మిషన్​భగీరథ నీళ్లు రావట్లేదని అన్నపురెడ్డిపల్లి మండలంలోని పెద్దిరెడ్డిగూడెం అనుబంధ గ్రామమైన తంగేళ్లగుంపు గ్రామస్తులు బుధవారం రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో నేషనల్​హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. తాగేందుకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని వాపోయారు.

దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్​నిలిచింది. ఎస్సై షాహినా సిబ్బందితో అక్కడికి చేరుకుని గ్రామస్తులకు సర్దిచెప్పారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.