మహబూబ్ నగర్ జిల్లాలో కాకా కు ఘన నివాళి

మహబూబ్ నగర్  జిల్లాలో  కాకా కు ఘన నివాళి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి వర్ధంతిని పాలమూరు కలెక్టరేట్ లో నిర్వహించారు. ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిరుపేదలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆర్డీవో నవీన్, డీవైఎస్​వో శ్రీనివాస్, డీఎంహెచ్​వో కె కృష్ణ, సీఎంవో బాలు యాదవ్, డిప్యూటీ తహసీల్దార్ దేవేందర్, సిబ్బంది అరుణ, నందు పాల్గొన్నారు.

అమ్రాబాద్: కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతిని మాలమహానాడు నాయకులు జరుపుకున్నారు. అమ్రాబాద్, పదర, మన్ననూర్ లో ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మద్దెల శేఖర్, రఘునాథం, యశ్వంత్, కృష్ణయ్య, లింగయ్య, సాయిలు పాల్గొన్నారు.  

అచ్చంపేట: దళిత హక్కుల కోసం పోరాటాలు చేయడంతో పాటు హక్కులను సాధించడంలో కీలకపాత్ర వహించిన పీవీ రావు, వెంకటస్వామి కృషి మరువలేనిదని మాల మహానాడు రాష్ట్ర నాయకులు కుందా మల్లికార్జున్ పేర్కొన్నారు. పీవీ రావు, వెంకటస్వామి వర్ధంతిని మాల మహానాడు ఆధ్వర్యంలో నిర్వహించారు. వారి ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంజనేయులు, బాలస్వామి, రవీందర్, జనార్ధన్, అనిల్, వెంకటేశ్, శ్రీనివాస్, సుధాకర్ బాబు, పాండు, లక్ష్మణ్​ పాల్గొన్నారు.