ఇంట్లో మొక్కలు పెంచుతున్నారా?.. ఇవి తెలుసుకోండి 

ఫ్యామిలీతో ఓ మూడు రోజులు ట్రిప్​ వెళ్తే మొక్కల సంగతి ఎలా? అని ఆలోచిస్తుంటారు చాలామంది. అలాంటివాళ్ల కోసం కొన్ని కేరింగ్​ టిప్స్​ చెప్తోంది మహారాష్ట్రకు చెందిన అన్నాట్​ మాథ్యూస్. ఎనిమిదేళ్లుగా 300 వెరైటీ మొక్కల్ని పెంచుతోంది. గీక్స్​ ఆఫ్​ గ్రీన్ అనే యూట్యూబ్​ ఛానల్​ కూడా నడుపుతోంది. ఆ ఛానెల్​కు ఎనభైవేల సబ్​స్ర్కైబర్స్​ ఉన్నారు.

  • ఇంటి పక్కన లేదా ఆ కాలనీలో గార్డెనింగ్​ ఇష్టపడేవాళ్లతో ఫ్రెండ్​షిప్​ చేయాలి. మీరు అందుబాటులో లేనప్పుడు వాళ్లను రిక్వెస్ట్​ చేస్తే మొక్కల్ని చూసుకుంటారు.
  • కొన్ని మొక్కలకు ఎక్కువ నీళ్లు, ఇంకొన్నింటికి వారానికి ఒకసారి నీళ్లు పెడితే సరిపోతుంది. అందుకని ఆ మొక్కల్ని వేటికవి విడివిడి​గా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే నీళ్లు పోసేందుకు వచ్చినవాళ్లకు  గైడ్​ చేయడం ఈజీగా ఉంటుంది. 
  • ఎండ నేరుగా పడకుండా కొంచెం నీడ వచ్చే దగ్గర కుండీలను పెట్టాలి. నీడలో ఉంటే మట్టి ఎక్కువ టైం తడిగా ఉంటుంది.
  • చిన్న మొక్కల కుండీలన్నీ ఒకే దగ్గర పెట్టాలి.
  • వాటరింగ్​ పైప్​, క్యాన్​, స్ప్రేయర్​ వంటివి అందుబాటులో ఉంచాలి. టూర్​కి వెళ్లే ముందు ఒకసారి సరిపడా నీళ్లు పోయాలి.
  • వాటర్ బాటిల్​కు రెండు చిన్న రంధ్రాలు పెట్టి, బాటిల్​ను నీళ్లతో నింపి కుండీలో పెట్టేయాలి. డ్రిప్​లాగా ఒక్కో చుక్కా పడి మొక్క తడి ఆరదు.
  • వెడల్పాటి టబ్స్​ ఉంటే వాటిలో నీళ్లు నింపాలి. అందులో చిన్న మొక్కల కుండీలు నాలుగైదు కలిపి పెడితే తేమ​ తగ్గకుండా ఉంటుంది.
  • పెద్ద టబ్​లో నీళ్లు పోయాలి. అందులో త్రీ పర్సంట్​ హైడ్రోజన్​ పెరాక్సైడ్​, మూడు చుక్కల​ డిష్​  వాష్​  లిక్విడ్​​ పోసి కలపాలి. ఆ నీళ్లు మొక్కలకు స్ప్రే చేస్తే దోమలు రావు.
  • ఒక కాటన్​ క్లాత్​ను తాడులాగ చుట్టాలి. దాని ఒక కొసను మొక్క వేర్ల దగ్గర నాటినట్టు పెట్టాలి.  మొక్కల కుండీ పక్కన మరో బకెట్​తో నీళ్లు పెట్టి, క్లాత్​ రెండో కొసను అందులో ఉంచాలి. ఇలా చేస్తే నెమ్మదిగా మొక్కకు నీళ్లు అందుతుంటాయి.
  • మట్టిలో కోకోపిట్​ మిక్స్​ చేస్తే.. వాటర్​ ఎక్కువ పీల్చుకుంటుంది. కాబట్టి ఒకరోజు నీళ్లు పోయకపోయినా పర్వాలేదు.
  • ఎండిన ఆకుల వంటివి కుండీలో వేస్తే.. మట్టిలోని తడి త్వరగా ఆరిపోదు. దీన్నే మల్చింగ్​ అంటారు. 
  • మొక్క చుట్టూ తడిపిన బట్టలాంటివి కట్టినా ఉపయోగమే.