ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులు ప్రకటించిన బోర్డు

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులు ప్రకటించిన బోర్డు

హైదరాబాద్: ఇంటర్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో భారీ ఎత్తున సెలబ్రేట్ చేసుకునే దసరా పండుగ సెలవులను ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీలకు ఈ నెల (అక్టోబర్) 6 నుండి 13వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. తిరిగి 14వ తేదీన కాలేజీలు రీ ఓపెన్ కానున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఇవాళ (అక్టోబర్ 3) ఇంటర్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. బోర్డు ఆదేశాలు పాటించకుంటే ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీలపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఇంటర్ విద్యార్థులకు మొత్తం 8 రోజులు దసరా హాలీడేస్ ప్రకటించింది. 

ALSO READ | Bathukamma Special: తెలంగాణ పల్లెల్లో.. జనం మాటల్లో బతుకమ్మ గాథలు ఇవీ..!

నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజుల్లో క్లాసులు నిర్వహిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలను హెచ్చరించింది. కాగా, తెలంగాణలో పాఠశాలలకు విద్యాశాఖ ఇప్పటికే సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో దసరా పండుగ వాతావరణం నెలకొంది. బతుకమ్మ, దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో రాష్ట్రంలోని ఊరు, వాడల్లో పండుగ శోభ సంతరించుకుంది. దసరా సెలవులు షూరు కావడంతో అంతా సొంత ఊర్లకు బయలుదేరుతున్నారు. కాగా, ఈ నెల 12న రాష్ట్రంలో దసరా పండుగ జరుపుకోనున్న విషయం తెలిసిందే.