
చాట్ జీపీటీ యాప్ వచ్చేసిందోచ్!
జీపీటీ (జనరేటెడ్ ప్రి ట్రైన్డ్ టెక్నాలజీ) మోడల్‌లో పనిచేసే అమెరికన్ కంపెనీ ఓపెన్ ఏఐ ద్వారా చాట్ జీపీటీ డెవలప్ అయిన విషయం తెలిసిందే. చాట్ జీపీటీ అనేది యూజర్ అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తుంది. ప్రస్తుతం చాట్ జీపీటీ రెండు వెర్షన్లు ఉన్నాయి. ఒకటి ఉచితం, మరొకటి డబ్బులు కట్టి వాడే చాట్ జీపీటీ ప్లస్ వెర్షన్. అయితే, అమెరికన్ కంపెనీ ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ ఆండ్రాయిడ్ వెర్షన్ యాప్‌ను మొదలుపెట్టింది. ఇంతకుముందు, చాట్ జీపీటీ ఐ– ఫోన్స్ కోసం మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, ఇప్పుడు చాట్ జీపీటీ యాప్‌ని ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఓపెన్ ఏఐ ప్రస్తుతం మనదేశంతో పాటు యూఎస్, బంగ్లాదేశ్, బ్రెజిల్ దేశాల్లో ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఈ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. అయితే, మరికొన్ని దేశాల్లో త్వరలోనే అందుబాటులోకి తేనుంది. చాట్‌జీపీటీ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నకిలీ యాప్‌లు కూడా కనిపిస్తున్నాయి. అవి చెక్ చేసుకోవాలి. ఒరిజినల్ చాట్ జీపీటీ యాప్ లోగో నలుపు రంగులో ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే చాట్ జీపీటీ కింద రాసిన ఓపెన్ ఏఐ కనిపిస్తుంది. యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తరువాత సైన్‌అప్ చేయాలి. ఇ-–మెయిల్ ఐడీని ఎంటర్ చేసి, పాస్వర్డ్ క్రియేట్ చేసి లాగిన్ అవ్వచ్చు.
నెట్ఫ్లిక్స్లానే..డిస్నీ ప్లస్
నెట్‌ఫ్లిక్స్ బయటి వ్యక్తులతో సర్వీస్‌ను షేర్ చేయడానికి అదనపు పేమెంట్ కట్టించుకుంటోంది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అకౌంట్ వెబ్‌సైట్ 4 వివైజ్ల లిమిట్ ఉన్నప్పటికీ.. గరిష్టంగా 10 డివైజ్‌లలో లాగిన్ అయ్యేందుకు పర్మిషన్ ఇస్తోంది. ఇంటర్నల్ రీసెర్చ్ ప్రకారం.. కేవలం ఐదు శాతం ప్రీమియం సబ్‌స్ర్కయిబర్‌లు 4 కన్నా ఎక్కువ డివైజ్‌ల నుంచి లాగిన్ అయినట్లు చూపించాయి. అయితే, కంపెనీ ఈ ఏడాది చివరిలో ఇంటర్నల్ పాలసీ అమలు చేయాలనుకుంటోంది. ప్రీమియం అకౌంట్ల కోసం 4 డివైజ్‌లకు మాత్రమే లాగిన్‌లను లిమిట్ చేస్తుందట. అలాగే వాడకాన్ని కేవలం 2 డివైజ్‌లకు మాత్రమే లిమిట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికైతే దాదాపు 50 మిలియన్ల మంది సబ్‌స్ర్కయిబర్‌లను కలిగిన యూజర్ల పరంగా హాట్‌స్టార్ మార్కెట్ లీడర్ అని ఇండస్ట్రీ డాటా చెప్తోంది.
శ్నాప్‌చాట్ రివార్డ్.. ఏడు వేల డాలర్లు?
సెప్టెంబర్ 2011లో లాంచ్ అయిన శ్నాప్‌చాట్, 2015లో లెన్స్ ఫీచర్స్ పరిచయం చేసింది. ప్రస్తుతం లెన్స్ ఫీచర్స్ వాడే యూజర్ల కోసం అదిరిపోయే వార్త చెప్పింది. అదేంటంటే... మనదేశంలో శ్నాప్‌చాట్ ఏఆర్ (ఆగ్యుమెంటెడ్ రియాలిటీ) వాడే వాళ్ల కోసం ఒక రివార్డ్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసింది శ్నాప్‌చాట్. దాని పేరు ‘లెన్స్ క్రియేటర్ రివార్డ్స్’. అయితే ఇది ఇండియన్స్ కోసం మాత్రమే కాదు. గ్లోబల్ యూజర్స్‌కు కూడా. ఈ మధ్య కాలంలో ఎప్పటికప్పుడు వచ్చే కొత్త ఫీచర్స్ వాడడంలో యాక్టివ్‌గా ఉన్నవాళ్లకు ఇదొక మంచి అవకాశం. అయితే ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇండియన్ లెన్స్ క్రియేటర్స్ 7,200 డాలర్లు (దాదాపు ఆరు లక్షలు) ప్రతి నెలా పొందొచ్చు. ఇందులో ఇండియాతోపాటు, మెక్సికో, అమెరికా దేశాలతో పాటు దాదాపు 40 దేశాలకు వర్తిస్తుంది. వాళ్లలో టాప్ పర్ఫార్మెన్స్ చేసినవాళ్లు రివార్డ్ గెలుచుకునే అవకాశం ఉంది. ‘‘ఇప్పటికే శ్నాప్‌చాట్ వాడేవాళ్లలో ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా ఏఆర్ క్రియేటర్స్, డెవలపర్స్‌తోపాటు టీమ్స్ కూడా ఉన్నాయి. వాళ్ల అభిమానానికి విలువనిస్తూ ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చామ’’ని ఏఆర్ డెవలపర్ రిలేషన్స్ గ్లోబల్ హెడ్ జోసెఫ్ డార్కో చెప్పారు. శ్నాప్‌చాట్ రెవెన్యూ జూన్ 30 నాటికి దాదాపు ఎనిమిది కోట్లకుపైనే ఉంది. ప్రస్తుతం కంపెనీ కూడా ఈ ఏడాది మూడో క్వార్టర్ అంటే జులై నుంచి సెప్టెంబర్ అయిపోయేనాటికి 1.13 బిలియన్ డాలర్స్ (దాదాపు 9,264 కోట్లు) రెవెన్యూ రాబట్టాలని టార్గెట్ పెట్టుకుందట. ఇప్పటికే డైలీ యాక్టివ్ యూజర్లు ప్రతి ఏటా14 శాతం పెరుగుతున్నారు. సెకండ్ క్వార్టర్ అయిపోయేనాటికి 397 మిలియన్ యూజర్లు ఉన్నట్టు తెలిసింది. ఈ లెక్కన శ్నాప్‌చాట్ స్ట్రాటజీ ప్రకారం తన టార్గెట్‌ని రీచ్ అయ్యే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి.