
ఇటీవల ప్రచురించిన వార్షిక లింగ వ్యత్యాస నివేదిక, 2023 ప్రకారం, లింగ సమానత్వం పరంగా భారతదేశం 146 దేశాల్లో 127వ స్థానంలో ఉంది. గత సంవత్సరం కంటే ఎనిమిది స్థానాలు మెరుగుపడింది. 2006 నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఎఫ్) ఏటా గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ను విడుదల చేస్తోంది. ఇది 146 దేశాల్లో నాలుగు రంగాల్లో లింగ సమానత్వాన్ని కొలుస్తుంది. అవి ఆర్థిక భాగస్వామ్యం, అవకాశం, విద్యా సాధన, ఆరోగ్యం, మనుగడ, రాజకీయ సాధికారత.
ముఖ్యాంశాలు
లింగ సమానత్వం పరంగా భారతదేశం 146 దేశాల్లో127వ స్థానంలో ఉంది. గత సంవత్సరం కంటే ఎనిమిది స్థానాలు మెరుగుపడింది. నివేదిక ప్రకారం భారతదేశం అన్ని స్థాయిల విద్యా నమోదులో సమానతను సాధించింది. భారతదేశంలో లింగ వ్యత్యాసం 64.3శాతం వరకు తగ్గింది . అయితే, ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలపై కేవలం 36.7శాతం సమానత్వానికి చేరుకుందని రిపోర్టు స్పష్టం చేసింది. రాజకీయ సాధికారతలో భారతదేశం 25.3% సమానత్వాన్ని నమోదు చేసింది. 15.1శాతం మంది మహిళలు పార్లమెంటేరియన్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2006లో విడుదలైన తొలి నివేదిక తర్వాత దేశంలో ఇదే అత్యధికం. గ్లోబర్ జెండర్ గ్యాప్ రిపోర్టులో భారత్‌కు పొరుగున ఉన్న పాకిస్థాన్ (142), బంగ్లాదేశ్ (59), చైనా (107), నేపాల్ (116), శ్రీలంక (115), భూటాన్ (103) ర్యాంకులో ఉన్నాయి. ఐస్‌లాండ్ వరుసగా 14వసారి ప్రపంచంలో అత్యధిక లింగ సమాన దేశం, 90శాతం కంటే ఎక్కువ లింగ అంతరాన్ని తొలగించిన ఏకైక దేశంగా నిలిచింది. మొత్తమ్మీద దక్షిణాసియా ప్రాంతం 63.4శాతం లింగ సమానత్వాన్ని సాధించింది. ఇది ఎనిమిది ప్రాంతాల్లో రెండో అత్యల్పంగా ఉంది.