ఎఫ్​ అండ్ ​ఓతో ఏట రూ. 60 వేల కోట్ల నష్టం 

ఎఫ్​ అండ్ ​ఓతో ఏట రూ. 60 వేల కోట్ల నష్టం 

ముంబై:  ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్​వల్ల మనదేశంలోని కుటుంబాలు ఏడాదికి రూ. 60 వేల కోట్ల వరకు నష్టపోతున్నాయని సెబీ చైర్‌‌‌‌పర్సన్ మాధవీ బుచ్ మంగళవారం తెలిపారు.  ఎన్ఎస్ఈలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, డెరివేటివ్ మార్కెట్‌‌‌‌లలో ఇటువంటి బెట్లను "మాక్రో ఇష్యూ"గాఎందుకు పిలవకూడదని ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థకే సమస్యగా మారడాన్ని మాక్రో ఇష్యూ అంటారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో పెట్టే డబ్బును ఐపీఓ లేదా మ్యూచువల్​ఫండ్లలో పెడితే బాగుంటుందని అన్నారు.  

సెబీ అధ్యయనం ప్రకారం ఈ విభాగం 90 శాతం ట్రేడ్‌‌‌‌లలో నష్టాలే వస్తున్నట్టు తేలింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కార్యకలాపాలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని, ఫీజును పెంచడం వంటి చర్యలు తీసుకుంటామని తెలిపింది. కాంట్రాక్టు కనీస ధరను రూ.20 వేలకు పెంచే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించింది.