నిజామాబాద్ లో ఆకాశరామన్న ఫ్లెక్సీల కలకలం..

నిజామాబాద్ లో ఆకాశరామన్న ఫ్లెక్సీలు కలకలం రేపాయి. పర్యాటక రంగంపై రెడ్ టేపిజం అంటూ నిజామాబాద్ లోని ప్రధాన కూడళ్లలోని ఫ్లెక్సీలు వెలిసాయి. నిజామాబాద్ జిల్లాలో పర్యాటక రంగం కొత్త మంది అధికారుల కబంధ హస్తాల్లో చిక్కిందంటూ ఫ్లెక్సీలపై రాసి ఉండటం కలకలం రేపింది.

అన్ని ఆధారాల తో త్వరలో ముందుకు వస్తానంటూ ఆకాశ రామన్న ఫ్లెక్సీలు ప్రత్యక్షమవ్వటం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో పర్యాటక రంగాన్ని అడ్డుకుంటున్న ఆ అధికారులు ఎవరు అంటూ చర్చ మొదలైంది.నిజామాబాద్ లో ఫ్లెక్సీల కలకలం ఇది కొత్తేమి కాదు.. గతంలో కూడా జిల్లాలోని మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలో మా ఊరికి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ రావొద్దంటూ గ్రామస్తులు ఫ్లెక్సీలు వెలిసాయి.

బీఆర్ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీలను తొలగించేందుకు ప్రయత్నించగా.. రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. రంగంలోకి దిగిన పోలీసుల ఇరువర్గాలకు నచ్చ జెప్పి గొడవ సద్దుమణిగేలా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆకాశరామన్న ఫ్లెక్సీలు వెలియటంతో జిల్లాలో వర్గపోరు మరోసారి బయటపడినట్లయ్యింది.