MAA: సినీ నటులపై అసభ్యకర పోస్టులు..ఆ 18 యూట్యూబ్ ఛానళ్లు బ్యాన్

'మా' సినిమా కళాకారులపై ఆసభ్యకరమైన,అవమానకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేసినందుకు గాను 25 యూట్యూబ్ ఛానెల్‌లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ అణిచివేతలో భాగంగా ‘మా’ మరో అడుగు ముందుకు వేసింది. తాజాగా అసత్య వార్తలను పోస్ట్‌ చేస్తున్న 18 యూట్యూబ్‌ ఛానళ్లను రద్దు చేయించినట్లు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) తెలిపింది. ఈ మేరకు మా రద్దు చేసిన ఆ యూట్యూబ్ ఛానళ్ల వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 

ఆ క్రమంలో.." MAA అసోషియాన్ తరపున, మేము అన్ని యూట్యూబర్‌లు మరియు సోషల్ మీడియా ట్రోలర్‌లను గమనించవలసిందిగా కోరుతున్నాము అంటూ స్పెషల్ రిక్వెస్ట్ హెచ్చరిక జారీ చేసింది. " 'మా' సినిమా వాళ్ళ కుటుంబాలకు పరువు నష్టం కలిగించే ట్రోల్ వీడియోలను సైబర్ క్రైమ్ కార్యాలయానికి నివేదించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పటివరకు ఎటువంటి అసభ్యకరమైన వార్తలున్న, ఫొటోస్ ఉన్న దయచేసి వెంటనే మీ ఛానెల్‌లు మరియు ప్రొఫైల్‌ల నుండి ఆ కంటెంట్‌ను తీసివేయండి" అంటూ ట్విట్టర్ X ద్వారా పోస్ట్ చేసింది. ఇకపోతే తాజాగా మా రద్దు చేసిన ఛానళ్లలో ‘బ్రహ్మి ట్రోల్స్‌ 3.0’, ‘టీకే క్రియేషన్స్‌’, ‘డాక్టర్ ట్రోల్స్‌’, ‘ట్రోలింగ్‌ పోరడు’, ‘అప్‌డేట్‌ ట్రోల్స్‌’ వంటివి రద్దు చేయబడిన యూట్యూబ్‌ ఛానల్స్‌ జాబితాలో ఉన్నాయి. 

ALSO READ | Anasuya Bharadwaj: అపుడు మెసేజ్ ఇవ్వాల‌నుకున్నా..విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో వివాదంపై అన‌సూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

ఇటీవలే నటీనటులపై ట్రోలింగ్ చేస్తున్న యూట్యూబర్లపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేసింది. అసోసియేషన్ తరపున శివబాలాజీ, రాజీవ్ కనకాల, సీనియర్ నటుడు శివకృష్ణలు డీజీపీని కలిసి తమ ఫిర్యాదును అందజేశారు.  'అణచివేత మొదలైంది. నటీనటులు, వారి కుటుంబాలు మరియు వ్యక్తిగత దాడుల గురించి అవమానకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేసినందుకు..పలు యూట్యూబ్ ఛానెల్‌లు రద్దు చేయబడ్డాయి.ఇది ప్రారంభం మాత్రమే.భవిష్యత్‌లో ఇలాంటి ఛానళ్లపై చర్యలు కొనసాగుతాయని" ఎక్స్‌వేదికగా మా ఇదివరకే పోస్ట్‌ చేసింది.