డీడీఎన్‌‌‌‌ పథకంలో మరో 270 టెంపుల్స్‌‌‌‌.. ఒక్కో ఆలయానికి నెలకు రూ.10 వేలు

డీడీఎన్‌‌‌‌ పథకంలో మరో 270 టెంపుల్స్‌‌‌‌..  ఒక్కో ఆలయానికి నెలకు రూ.10 వేలు
  • ఇప్పటికే 6,541 ఆలయాలకు ఏటా రూ.78.49 కోట్ల నిధులిస్తున్న సర్కార్‌

‌‌‌‌‌‌‌
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో దూప దీప నైవేద్యం (డీడీఎన్‌‌‌‌) పథకంలో భాగంగా మరో 270 ఆలయాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,541 ఆలయాలకు ఈ పథకం కింద ఏటా ప్రభుత్వం రూ.78.49 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నది. తాజాగా డీడీఎన్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 600లకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. 

ఇందులో 270 ఆలయాలకు ఈ పథకం వర్తింపజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయ చరిత్ర, ఆదాయ మార్గాలను పరిశీలించాకే ఈ పథకానికి ఎంపిక కమిటీ ఆలయాలను సెలెక్ట్‌‌‌‌ చేసింది. అయితే,ఏ జిల్లాల్లో ఎన్ని ఆలయాలు ఉన్నాయనేది త్వరలోనే ప్రకటిస్తామని ఎండోమెంట్ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన ప్రతి ఆలయానికి నెలకు రూ.10 వేలు అందించనున్నారు. కాగా, రూ.12 వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలను మాత్రమే ఈ పథకం కింద ఎంపిక చేయనున్నారు.