ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ స్టా్ర్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో ముంబై పోలీసులు దూకుడు పెంచారు. సైఫ్‌పై దాడి చేసిన నిందితున్ని గుర్తించేందుకు స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తిని శనివారం (జవనరి 18) ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో అతని పాత్రపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.
సైఫ్ కేసులో ఇప్పటికే పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. ప్రధాన నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సైఫ్‌పై దాడి చేసిన నిందితుడు శుక్రవారం (జనవరి 17) బాంద్రా రైల్వే స్టేషన్లో కనిపించినట్లు సీసీ ఫుటేజీ వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే.. బాంద్రాలోని సైఫ్ నివాసం సద్గురు శరణ్ అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీ తాజా నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో సైఫ్ పై దాడి చేసిన నిందితుడు మెట్ల ద్వారా ఇంట్లోకి వెళ్లడం రికార్డ్ అయ్యింది. ఈ వీడియా ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాంద్రా పీఎస్‌లో కనిపించిన వ్యక్తి, ఈ వీడియోలో కనిపించిన వ్యక్తి ఒక్కడే అని పోలీసులు నిర్ధారించారు. దీంతో నిందితుడి కోసం ప్రత్యేక టీములను రంగంలోకి దింపారు. ఇక, దుండగుడి దాడిలో కత్తిపోట్లకు గురైన సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. త్వరలోనే అతడిని డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ALSO READ | దాడి జరిగిన రోజు సైఫ్ అలీఖాన్ ఇంట్లో జరిగింది ఇదే.. డబ్బు కోసమే అలా..
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై బుధవారం (జవనరి 15) దాడి జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో సెలబ్రెటీలకు నిలయమైన బాంద్రాలో ఉన్న తన నివాసంలో సైఫ్ అలీఖాన్‌పై అర్థరాత్రి గుర్తు తెలియని దుండగుడు కత్తితో ఎటాక్ చేశాడు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు సైఫ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
సైఫ్ అలీఖాన్ ఆరు కత్తి పోట్లకు గురైనట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. సైఫ్ అలీఖాన్‌పై దాడి వార్తతో బాలీవుడ్ ఒక్కసారిగా షేక్ అయ్యింది. ఈ ఘటన ముంబైతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ముంబై పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షించడం గమనార్హం.