
భారత నౌకాదళంలోకి మరో అధునాతన స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ వింధ్యగిరి చేరింది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని హుగ్లీ నదీ తీరంలోని రీచ్ షిప్‌యార్డులో ఈ నౌకను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధికారికంగా భారత నౌకాదళంలోకి ప్రవేశ పెట్టారు.
- శత్రు దేశ రాడార్లకు చిక్కకుండా స్వదేశీ పరిజ్ఞానంతో ఏడు యుద్ధ నౌకలను తయారు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రాజెక్ట్ 17 ఆల్పా చేపట్టింది. 2019–22 వరకు ఐదు యుద్ధ నౌకలను నిర్మించి, నౌకాదళానికి అప్పగించారు. ఇందులో వింధ్యగిరి ఐదో యుద్ధనౌక.
- గైడెడ్ క్షిపణులను ప్రయోగించ గల సామర్థ్యం ఉన్న ఈ నౌక పొడవు 149 మీటర్లు, బరువు 6,670 టన్నులు. ఇది గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు.
- పీ17ఏ రకం ఈ యుద్ధ నౌకల్లో గైడెడ్ మిస్సైళ్లు ఉంటాయి. భూమి, ఆకాశం, నీటి లోపలి నుంచి ఎదురయ్యే విపత్తులను గుర్తించి నిర్వీర్యం చేయగలవు.
- కర్ణాటకలోని పర్వత శ్రేణి పేరిట దీనికి వింధ్యగిరి అని పేరు పెట్టారు.
- స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్ఎస్ వింధ్యగిరి యుద్ధనౌకను కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ నిర్మించింది. ఈ నౌకలో వినియోగించిన పరికరాలు, వ్యవస్థలు 75 శాతం వరకు దేశీయంగా తయారయ్యాయి.
రాజులు, విదేశీ యాత్రికులు
రాజు సందర్శించిన విదేశీ యాత్రికుడు
చంద్రగుప్త మౌర్య మెగస్తనీస్ (గ్రీకు)
చంద్రగుప్త–2 ఫాహియాన్
హర్షవర్ధనుడు హ్యూయన్‌త్సాంగ్ (చైనా)
నరసింహవర్మ–1 హ్యూయన్‌త్సాంగ్ (చైనా)
మిహిరభోజుడు సులేమాన్ (అరబ్)
పులకేశి–2 హ్యూమన్త్సాంగ్ (చైనా)
అమోఘవర్షుడు సులేమాన్ (అరబ్ యాత్రికుడు)
ఇంద్రుడు–3 అల్ మసూది (అరబ్ యాత్రికుడు)
రుద్రమదేవి మార్కోపోలో (వెనిస్ యాత్రికుడు)
సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా మీర్ జైనుల్ అబిదిన్ (పర్షియా)
అబ్దుల్లా కుతుబ్ షా ట్రావెర్నియర్
మొదటి దేవరాయలు నికోలాయ్కోంటీ (ఇటలీ)
రెండో దేవరాయలు అబ్దుల్ రజాక్ (పర్షియా)
శ్రీకృష్ణదేవరాయలు డిమింగోఓ ఫేజ్ (పోర్చుగీసు)