
నల్లమల అడవులు అంటే ప్రకృతి రమనీయతీయకు, సోయగాలు, వణ్యమృగాలకు, సుందర జలపాతాలకు నిలయం. పచ్చని చెట్లు, ఎత్తయిన కొండలు వాటిపై అలుముకున్న పొగమంచు చూపరులను కట్టిపడేస్తాయి. అలాంటి నల్లమల ప్రకృతి ఒడిలో మరో జలపాతం వెలుగులోకి వచ్చింది.
నల్లమల అభయారణ్యం నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని ( NSTR ) పెద్ద చెరువు సమీపంలోని అడవిలో గల మునిమాడుగు ఏరు వద్ద 150 అడుగుల ఎత్తునుండి దూకుతున్న జలపాతం వెలుగులోకి వచ్చింది. అక్కడ నివసించే చెంచులు, ఫారెస్ట్ వారికి తప్ప తెలియని ఈ జలపాతం చూడడానికి ఫారెస్ట్ అనుమతులు లేవు.
ALSO READ:తిరుమల ఘాట్ రోడ్డులో బోల్తాపడిన కారు
ఇలాంటి సుందర జలపాతాలను సందర్శించేందుకు ఫారెస్ట్ అధికారులు పర్యాటకులకు అనుమతులు ఇస్తే పర్యాటకం మరింత అభివృద్ది చెందుతుందని పలువురు ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.