![చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ](https://static.v6velugu.com/uploads/2025/02/another-big-name-to-miss-as-australia-finalise-champions-trophy-squad_Krgo9uY2fA.jpg)
సిడ్నీ: చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే గాయాలతో కెప్టెన్ ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ మార్ష్, రిటైర్మెంట్ ఇచ్చి మార్కస్ స్టోయినిస్ టోర్నీకి దూరం కాగా, తాజాగా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ సేవలను కూడా కోల్పోయింది. వ్యక్తిగత కారణాలతో స్టార్క్ ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకున్నాడు.
అతని నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ పేర్కొన్నాడు. ఇక పేసర్లు స్పెన్సర్ జాన్సన్, నేథన్ ఎలీస్, సీన్ అబాట్, బెన్ డ్వారిషస్ కొత్తగా జట్టులోకి వచ్చారు. ఫ్రేజర్ మెక్‌గర్క్, ఆరోన్ హ్యాడ్లీ, లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంగా కూడా టీమ్‌లో ఉన్నారు. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ గైర్హాజరీతో ఈ టోర్నీలో స్టీవ్ స్మిత్‌కు ఆసీస్ కెప్టెన్సీ అప్పగించారు. 2023 వన్డే వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించిన కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్‌లాంటి పేసర్లు లేకుండా ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ ఆడటం ఆసీస్‌కు ప్రతికూలాంశంగానే చెప్పొచ్చు.