హైదరాబాద్: అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కొరియోగ్రాఫర్, జనసేన నేత జానీకి మరో బిగ్ షాక్ తగిలింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే జానీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయగా.. తాజాగా జానీ కామ క్రీడల వ్యవహారం రాష్ట్ర మహిళా కమిషన్‌కు చేరింది. జానీ మాస్టర్ బాధితురాలు ఇవాళ (సెప్టెంబర్ 18) స్టేట్ ఉమెన్ కమిషన్‌ను ఆశ్రయించింది. మహిళా సంఘాలతో కలిసి మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదను కలిసిన బాధితురాలు.. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డానని.. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఫిర్యాదు చేసింది.
Also Read :- ఇక జైలుకే.. నో బెయిల్
ఇప్పటికే జానీ కోసం పోలీసులు గాలిస్తుండగా.. తాజాగా బాధితురాలు మహిళా కమిషన్‌ను ఆశ్రయించడంతో లైంగిక వేధింపుల కేసులో జానీ మెడకు ఉచ్చు బిగుస్తోంది. మరోవైపు జానీ లైంగిక వేధింపుల కేసుపై రాజేంద్రనగర్ డీసీపీ స్పందించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. జానీ మాస్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని.. అతడిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. అయితే, జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నారని.. లేదు అతడు నార్త్ ఇండియాలో తలదాచుకున్నాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏ క్షణమైనా పోలీసులు జానీ అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.