హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన నేత జానీకి మరో బిగ్ షాక్ తగిలింది. పోక్సో కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్ గెలిచిన నేషనల్ ఫిలిం అవార్డ్ ఫర్ బెస్ట్ కొరియోగ్రఫీ 2022 అవార్డ్‌ను కమిటీ రద్దు చేసింది. ధనుష్ నటించిన తిరుచిట్రంబలం సినిమాకుగానూ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్ నేషనల్ అవార్డ్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ నెల 8న ఢిల్లీలో జరగనున్న అవార్డ్ ఫంక్షన్ హాజరయ్యేందుకు జైల్లో ఉన్న జానీ మాస్టర్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు మధ్యంతర బెయిల్ సైతం మంజూరు చేసింది.
Also Read :- మీ ఇంట్లోని పసుపులో కల్తీని ఇలా కనిపెట్టొచ్చు..!
ఈ సమయంలో అవార్డ్ రద్దు కావడంతో జానీ బెయిల్‌పై సందిగ్ధం నెలకొంది. కాగా, అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో ఈ నెల 19న కొరియోగ్రాఫర్ జానీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైల్లో ఉన్నారు. నేషనల్ అవార్డ్ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు రంగారెడ్డి జిల్లా కోర్టు జానీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు నేషనల్ అవార్డ్ రద్దు కావడంతో ఆయన బెయిల్ పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.