మహా కుంభమేళాలో మరో తొక్కిసలాట జరిగిందా?..

మహా కుంభమేళాలో మరో తొక్కిసలాట జరిగిందా?..

మహా కుంభమేళాలో మరో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది..బుధవారం ఉదయం తెల్లవారు జామున 5.55 గంటలకు ప్రయాగ్ రాజ్లోని ఝూసి ప్రాంతంలో  మరో తొక్కిసలాట జరిగినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

మొదట తొక్కిసలాట జరిగిన సెక్టార్ 2 కు ఝూసీ ప్రాంతం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఈ ఘటనపై అధికారులనుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రత్యక్ష సాక్షులు మాత్రం.. ఝూసీలో తొక్కిసలాట జరిగింది.. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు..ఇందుకు ఇక్కడ పోగు పడిన బట్టలు, చెప్పుల గుట్టలే సాక్ష్యం అని చెబుతున్నారు. అయితే జూసీలో పుణ్యస్నానాలు చేసేందుకు ఎంతమంది భక్తులు వచ్చారు..జరిగిన తొక్కిసలాటలో చనిపోయారా అనే దానిపై స్పష్టత లేదు. 

బుధవారం ఉదయం 1.30 గంటలకు త్రివేణి సంగమం సెక్టార్ 2 వద్ద జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వందలాది మంది గాయపడి చికిత్స పొందుతున్నారు. అయితే అదే రోజు జరిగిన ఝూసీ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాట వెలుగులోకి రాలేదు.. రెండో తొక్కిసలాట జరిగిన సమయంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదని.. ఈ ఘటనలపై ఎవరూ స్పందించకపోవడంపై ప్రత్యక్ష సాక్షులు ఆందోళన వ్యక్తం చేశారు.