
SLBC టన్నెల్‌లో మరో మృతదేహం లభ్యం అయింది. లోకో ట్రాక్ దగ్గర మృతదేహం ఉన్నట్లు రెస్క్యూటీం గుర్తించింది. కన్వేయర్‌బెల్ట్ డ్రమ్‌కు 40 మీటర్ల దూరంలో మృతదేహాన్ని గుర్తించారు. లోకో ట్రైన్ శిథిలాల కింద డెడ్‌బాడీని గుర్తించిన రెస్క్యూటీం తవ్వకాలు చేపడుతుంది. శిథిలాలను గ్యాస్ కట్టర్ తో కట్ చేస్తున్నారు. మృత దేహానికి సంబంధించి ఒక కాలు కనిపించిందని.. దుర్వాసన వస్తుందని సమాచారం అందుతోంది.
శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (SLBC) సొరంగం పైకప్పు కూలిపోయి నెల రోజులకు పైగా గడిచినా , ప్రమాదంలో మరణించిన ఎనిమిది మంది కార్మికులలో ఏడుగురి మృతదేహాలను వెలికితీయడానికి సహాయకులు కష్టపడుతున్నారు. ఫిబ్రవరి 22న 14 కిలోమీటర్ల సొరంగంలో ఒక భాగం కూలిపోయిన విషయం తెలిసిందే. 50 మంది కార్మికులు సొరంగం నుండి బయటకు రాగలిగారు.. సొరంగం పైకప్పు కూలిపోయిన తర్వాత ఎనిమిది మంది లోపల చిక్కుకుపోయారు. ఇప్పటివరకు, ఒక మృతదేహాన్ని మాత్రమే వెలికి తీశారు. ఇప్పుడు మరో మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ గుర్తించింది.