గత కొంతకాలంగా రాష్ట్రంలో ఎదో ఒక ప్రాంతంలో జనాలపై కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. చిన్నపిల్లలతోపాటు పెద్దవారిపై కూడా కుక్కలు దాడి చేస్తూ గాయపరుస్తున్నాయి. కుక్కల దాడిలో ఇప్పటికే ఇద్దరు ముగ్గురు చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా కుక్కల దాడి చేయడంతో మరో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఇస్నాపూర్ నుండి నందిగామ వెళ్ళే రోడ్డులో ఉన్న మహిదర వెంచర్ దగ్గర విశాల్ అనే ఆరేళ్ల బాలుడిపై వీదికుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కూలి పనులు చేసేందుకు బాలుడి కుటుంబం బీహర్ నుంచి వచ్చింది. మృతదేహన్ని పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు.