మార్కెట్లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ..

మార్కెట్లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ..

మార్కెట్లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. మోటోరోలాజీ సిరీస్‌లో మోటో జీ14 (Moto G14) మొబైల్‌ను లాంచ్ చేసింది. రూ.10,000 లోపు బడ్జెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ఇందులో 6.5 అంగుళాల డిస్‌ప్లే, 50మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా, 5,000mAh బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న మోటో జీ13 (Moto G13) స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ వేరియంట్‌గా మోటో జీ14 రిలీజైంది. 4GB Ram+ 128GB Storage  గల దీని ధర రూ.9,999 మాత్రమే.  జియో నుంచి రూ.3,000 బెనిఫిట్స్ ఉన్నాయి. 

ఆగస్ట్ 8న మోటో జీ14 సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ , మోటోరోలా ఇండియా వెబ్‌సైట్స్, రీటైల్ స్టోర్లలో దీనిని కొనుగోలు చేయొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.750 తగ్గింపు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్‌తో కేవలం రూ.9,249 ధరకే ఈ మొబైల్ సొంతం చేసుకోవచ్చు. స్టీల్ గ్రే, స్కై బ్లూ కలర్స్‌లో  ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. వీగన్ లెదర్ ఫినిష్‌తో బటర్ క్రీమ్, పేల్ లిలాక్ కలర్ ఆప్షన్స్‌ని త్వరలో మోటోరోలా రిలీజ్ చేయనుంది. 

మోటో జీ14 ఫీచర్స్
మోటో జీ14 స్మార్ట్‌ఫోన్ లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్ సెటప్ ఉంది. Unisoc T616 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 + మైయూఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 అప్‌గ్రేడ్‌తో పాటు మూడేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి.  మైక్రోఎస్‌డీ కార్డుతో 1TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. మోటో జీ14 స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ పిక్సెల్, ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్ టెక్నాలజీతో 50మెగాపిక్సెల్ ప్రైమరీ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో వీడియో, స్లో మోషన్, క్యాప్చర్ వీడియో, డ్యూయెల్ టైమ్ ల్యాప్స్, 4x డిజిటల్ జూమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 20వాట్ టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులో లభిస్తుంది. డ్యూయెల్ సిమ్, ఎస్‌డీ కార్డ్ సపోర్ట్ ఉంది.