కార్వీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీపై మరో కేసు నమోదైంది. కోట్ల రూపాయలు ICICI బ్యాంకు నుంచి లోన్ తీసుకుని తిరిగి చెల్లించలేదని బ్యాంక్ అధికారులు... సైబరాబాద్ ఎకనామికల్ వింగ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే హైదరాబాద్ CCS పోలీసులు కార్వీ కంపెనీపై మూడు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కార్వీ ఎండీ పార్థసారధి పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ద్వారా కస్టమర్లు షేర్లు కొంటే... వాటిని తన సొంత అకౌంట్స్ కు ట్రాన్స్ ఫర్ చేసుకుంది కార్వీ సంస్థ. ఆ షేర్స్ ను చూపించి బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. ఆ రుణాలు కట్టకుండా ఎగ్గొట్టడంతో జరిగిన మోసాన్ని గ్రహించి CCS పోలీసులకు కంప్లైంట్ చేశారు సంబంధిత బ్యాంక్ అధికారులు.
హైదరాబాద్ CCS పోలీసులకు అందిన ఫిర్యాదుతో.. కార్వీ ఎండీ పార్థసారధిని అరెస్ట్ చేశారు. కస్టమర్లు, బ్యాంకు అధికారుల నుంచి వచ్చిన మరో రెండు ఫిర్యాదులతో కలిపి హైదరాబాద్ కమిషనరేట్ లిమిట్ లో మొత్తం కార్వీ సంస్థపై మూడు కేసులు నమోదు చేసి ఎండీ పార్థసారధిని రిమాండ్ కి తరలించారు. సైబరాబాద్ లోనూ మరో కేసు నమోదైంది. ఐసిఐసిఐ బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఎగ్గొట్టారన్న ఆరోపణలపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగానికి బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. కస్టమర్ల షేర్లు తనఖా బెట్టి ICICI బ్యాంకు నుంచి 500 కోట్ల రుణాన్ని పొందినట్లు ఫిర్యాదులో తెలిపారు. తమకి రుణాన్ని తిరిగి చెల్లించలేదని సైబరాబాద్ పోలీసులకు ఐసిఐసిఐ బ్యాంక్ అధికారులు కంప్లయింట్ చేశారు. దీంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఎకనమిక్ అఫెన్స్ వింగ్ కేసు నమోదు చేసి విచారణ చేస్తోంది.
కార్వి ఎండి పార్థసారధిని కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు పోలీసులు. రెండు రోజుల పాటు సీసీఎస్ పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఈ నెల 25 ,26 ల్లో రెండు రోజుల పాటు పార్థసారధి ని సీసీఎస్ పోలీసులు విచారణ చేయనున్నారు .. కస్టమర్ల షేర్లను కంపెనీ షేర్లుగా నమ్మించి వివిధ బ్యాంకు ల నుంచి కోట్ల రూపాయలు రుణాలు పొందిన కార్వి సంస్థపై ఆధారాలు సేకరించారు పోలీసులు .కార్వీ సంస్థ రెండు వేల కోట్లకుపైగానే మోసం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 780 కోట్ల రుణాలను కార్వీ కన్సల్టెన్సీ ఎండీ పార్థసారధి తీసుకున్నట్లు విచారణలో తేలింది. గత కొంత కాలం నుంచి ఈ సంస్థపై సెబీ ఆంక్షలు విధించడంతో లేటేస్ట్ గా ఈ వ్యవహారం బయట పడింది.