శేఖర్ బాషాపై మరో కేసు నమోదు.. కొరియాగ్రఫర్​ శ్రేష్టి వర్మ ఫిర్యాదు

 శేఖర్ బాషాపై  మరో కేసు నమోదు.. కొరియాగ్రఫర్​ శ్రేష్టి వర్మ ఫిర్యాదు

బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై  నార్సింగ్​ పోలీస్​ స్టేషన్​ లో మరో కేసు నమోదైంది.   జానీ మాస్టర్ కేసులో విచారణ జరుగుతుండగా తన వ్యక్తిగత కాల్స్ రికార్డు లీక్ చేశాడని  కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  శ్రేష్టి వర్మ ఫిర్యాదును అందుకున్న పోలీసులు బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషాపై కేసు నమోదు చేశారు.   తన పరువుకు భంగం కలిగేలా  యూట్యూబ్ ఛానెల్స్ లో శేఖర్ బాషా మాట్లాడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.   

ఉద్దేశ పూర్వకంగా, దురుద్దేశంతో ప్రైవేట్ కాల్స్ రికార్డులను లీక్ చేశాడని, శేఖర్ బాషా వ్యక్తిగత మొబైల్ తో పాటు అతని వద్ద ఉండే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను సీజ్ చేయాలని శ్రేష్టి వర్మ కోరారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు శేఖర్ బాషాపై బీఎస్ఎన్ యాక్ట్ సెక్షన్79, 67, ఐటీ యాక్ట్ 72 కింద కేసు నమోదు చేశారు.