ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మరో కేసు

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మరో కేసు

గచ్చిబౌలి, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డిపై మరో కేసు ఫైల్ అయింది. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో నమోదైన కేసు విషయంలో అరెస్టు చేసేందుకు వెళ్లగా కౌశిక్​రెడ్డి తనమీద దురుసుగా ప్రవర్తిండంతో పాటు చనిపోతానని బెదిరించాడని మాసాబ్ ట్యాంక్ సీఐ పరుశురాం ఫిర్యాదు చేశారు. దాంతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

విధులకు ఆటంకం కలింగించారనే ఆరోపణలతో ఈ నెల 4న కౌశిక్ రెడ్డితో పాటుమరో 20 మందిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ సందర్భంలోనే మాసాబ్ ట్యాంక్  ఇన్ స్పెక్టర్ పరుశురాంను కౌశిక్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఇన్ స్పెక్టర్ కంప్లైంట్ పై కోర్టు అనుమతితో శుక్రవారం మరో కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.