- ట్రోలింగ్ చేయిస్తున్నాడని సైబర్క్రైమ్ను ఆశ్రయించిన బాధితురాలు
- నార్సింగి పీఎస్లో ఇప్పటికే హర్ష పై మూడు కేసులు
గచ్చిబౌలి, వెలుగు: యూట్యూబర్హర్షసాయిపై మరో కేసు నమోదైంది. తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయిస్తున్నాడని గచ్చిబౌలిలోని సైబరాబాద్సైబర్ క్రైమ్పోలీసులకు బాధితురాలు మరో ఫిర్యాదు చేసింది. తనపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, స్ర్కీన్షాట్లను అందజేసింది.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే నార్సింగి పీఎస్లో బాధితురాల ఫిర్యాదుతో హర్షసాయిపై లైంగిక ఆరోపణలు, చీటింగ్, బ్లాక్మెయిల్కేసులు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.