టాంటన్: టీమిండియాకు దూరమైన సీనియర్ ప్లేయర్ చతేశ్వర్ పుజారా కౌంటీ క్రికెట్‌లో సత్తా చాటుతున్నాడు. ఇంగ్లిష్ సమ్మర్ సీజన్‌లో ఆడిన మూడు లిస్ట్–ఎ మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు కొట్టాడు. ఇంగ్లండ్ వన్డే కప్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో పుజారా (113 బాల్స్‌లో 117 నాటౌట్) సెంచరీతో దుమ్మురేపడంతో అతను ఆడుతున్న ససెక్స్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో సోమర్‌సెట్‌పై విజయం సాధించింది.
తొలుత సోమర్‌సెట్ 50 ఓవర్లలో 318/6 స్కోరు చేయగా.. పుజారాకు తోడు టామ్ అస్లాప్ (60) రాణించడంతో ససెక్స్ మరో 11 బాల్స్ మిగిలుండగానే టార్గెట్‌ను ఛేజ్ చేసింది. కాగా, చతేశ్వర్ చివరగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఇండియా తరఫున బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో ఫెయిలవడంతో వెస్టిండీస్ టూర్‌కు సెలెక్టర్లు అతడిని పక్కనబెట్టారు.