రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు.. నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మేడలో చైన్ స్నాచింగ్.. 

చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా వరుస చైన్ స్నాచింగ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా సూర్యాపేటలో మరో చైన్ సంచింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలో నుంచి చైన్ లాకెళ్లిన చైన్ స్నాచర్.. మునగాల మండలం బరాకత్ గూడెం గ్రామ పరిధిలో చేసుకుంది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఓ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

మహిళ కోదాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. బరాకత్ గూడెం తమ పట్టణ పరిధి కాదని, మునగాలలో ఫిర్యాదు చేయమని తెలిపారు పోలీసులు. వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.