కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. జనవరి 21 నుంచి జరిగే గ్రామ సభల్లో వీటి కోసం అప్లికేషన్లు స్వీకరించాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎస్ శాంతి కుమారి. దీనికి సంబంధించి గైడ్స్ లైన్స్ తో సర్క్యులర్ పంపించారు.
గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డులతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్లు చేర్చడానికి దరఖాస్తులు స్వీకరించాలి. ఒకే కుటుంబం నుంచి వేరే పడ్తున్న కుటుంబాలకు కొత్త కార్డులు ఇచ్చేందుకు అప్లికేషన్లు తీసుకోవాలి. కుటుంబ పెద్దతో పాటు ఇతర కుటుంబ సభ్యుల వివరాలు, వారి ఆధార్ కార్డులు, కులం, మొబైల్ నంబర్, చిరునామా వంటి వివరాలను తీసుకోవాలని గైడ్ లైన్స్ లో స్పష్టం చేశారు.