శాయంపేట ఎంపీపీపై మరో చీటింగ్‌‌‌‌‌‌‌‌ కేసు

శాయంపేట ఎంపీపీపై మరో చీటింగ్‌‌‌‌‌‌‌‌ కేసు
  •     దళితబంధు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో ఇప్పటికే జైలులో ఉన్న ఎంపీపీ
  •     పాస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌లో భూమి ఎక్కిస్తానంటూ రైతు నుంచి రూ. 50 వేలు వసూలు
  •     మూడేండ్లు గడిచినా పని పూర్తికాకపోవడంతో పోలీసులకు రైతు ఫిర్యాదు

శాయంపేట, వెలుగు : శాయంపేట ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డిపై మరో చీటింగ్‌‌‌‌‌‌‌‌ కేసు నమోదు అయింది. గతంలో దళితబంధు ఇప్పిస్తానని ఓ వ్యక్తిని మోసం చేసిన కేసులో ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇదిలా ఉండగానే పట్టాదార్‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌లో భూమి ఎక్కిస్తానని చెప్పి ఓ రైతు నుంచి డబ్బులు తీసుకొని మోసం చేశాడంటూ మరో చీటింగ్‌‌‌‌‌‌‌‌ కేసు నమోదు అయింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతిసింగారం గ్రామానికి చెందిన చిలుకల సమ్మయ్యకు నేరేడుపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో 4.32 ఎకరాల భూమి ఉంది.

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఇచ్చిన పట్టా పాస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌లో 2.12 ఎకరాలు మాత్రమే నమోదు అయింది. దీంతో మిగిలిన భూమి పాస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌లో ఎక్కించాలని సమ్మయ్య తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ప్రగతిసింగారం గ్రామానికి చెందిన ఎంపీపీ తిరుపతిరెడ్డిని కలువగా రూ. 50 వేలు ఇస్తే మిగిలిన భూమి కూడా పాస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌లో ఎక్కించేలా చేస్తానని చెప్పారు. దీంతో సమ్మయ్య అదే గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి వేణు ద్వారా మూడేండ్ల కింద రూ. 50 వేలు ఎంపీపీ తిరుపతిరెడ్డికి ఇచ్చాడు.

మూడేండ్లు గడుస్తున్నా పాస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌లో భూమి ఎక్కించలేదు. దీంతో విసుగు చెందిన సమ్మయ్య తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా తిరుపతిరెడ్డి పట్టించుకోలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన సమ్మయ్య ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తిరుపతిరెడ్డి, పెద్దిరెడ్డి వేణుపై చీటింగ్‌‌‌‌‌‌‌‌ కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రమోద్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ తెలిపారు.