History : సముద్రంలో బయటపడిన పెద్ద నగరం.. చెక్కు చెదరని శిల్పాలు

History : సముద్రంలో బయటపడిన పెద్ద నగరం.. చెక్కు చెదరని శిల్పాలు

దేవీపుత్రుడు సినిమా చూశారా? అందులో శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా నగరం సముద్రం అడుగున ఉంటది. ఆ నగరం గురించి పరిశోధన చేసేందుకు పురావస్తు అధికారిగా వెంకటేశ్ రీసెర్చి మొదలుపెడతాడు. సేమ్ టు సేమ్.. అలాంటి నగరమే ఒకటి ఈజిప్టులో సముద్రగర్భంలో కలిసిపోయింది. ఆ నగరాన్ని ఓ పురావస్తు అధికారి ప్రపంచానికి పరిచయం చేశాడు.   

ఈ వందల ఏండ్ల క్రితమే సముద్రగర్భంలో అలెగ్జాండర్ పరాక్రమాన్ని ప్రత్యక్షంగా శతాబ్దంలో ఈజిప్టు మీద దండయాత్ర చేసిన కలిసిపోయింది. జనాలంతా 'అప్పట్లో ఒక నగరం ఉండేదట. దాని నిర్మాణం చూస్తే.. కండ్లు చెదిరిపోయేవట' అని కథలు కథలుగా చెప్పుకున్నారు. 'ఫలానా నగరం ఉంది' అనే చెప్పుకోవడమే తప్పు... ఎక్కడుందో, ఎలా ఉందో, అసలు ఉందో లేదో కూడా తెలియదు వాళ్లకి. 'అదంతా ఓ కట్టుకథ' అని కొట్టి పారేసిన వారూ ఉన్నారు.

 అయితే.. ఏదైనా ఒక విషయాన్ని నిరూపించాలంటే.. దానికి సంబంధించిన ఆధారాలు కావాలి. సరైన ఆధారాలతో ఓ పరిశోధకుడు ఆ కథలన్నీ కల్పించినవి కాదు.. నిజంగా జరిగినవని తేల్చాడు. నీటిపాలైన ఆ చారిత్రక నగరం అవశేషాలను ఆధారాలతో సహా నిజంగా ఉందని నిరూపించి ప్రపంచానికి మరోసారి పరిచయం చేశాడు. క్రీ.పూ. 3వ పురాతన ఆలయ అవశేషాలు చూసింది.

 హెరాక్లియాన్ నగరం. 2,500 సంవత్సరాల క్రితమే అపారమైన సంపదకు, ప్రజా సంక్షేమానికి చిరునామాగా విలసిల్లిన నగరం అది. దీని పూర్వనామం థోనీస్. కానీ.. హెరాక్లియన్ అనే పేరుతోనే ఎక్కువమందికి పరిచయం. ఫారోల పతనం ఈ నగరం నుంచే ప్రారంభమైంది. ఈజిప్టు మీద అలెగ్జాండర్ విజయంతో ఈ నగరం క్రమక్రమంగా తన వైభవాన్ని కోల్పోయింది. 

ఆ తర్వాత వంద సంవత్సరాలకు సముద్రగర్భంలో కలిసిపోయింది. ఆ తర్వాత అనగరం గురించి మెల్లమెల్లగా జనాలు కూడా. మరిచిపోయారు. అసలు హెరాక్లియన్ నగరం  ఎందుకు సముద్రంలో కలిసిపోయిందనే విషయం కొన్ని వందల ఏళ్లుగా అంతుపట్టని మిస్టరీగానే మిగిలిపోయింది.