5 వేల పోస్టులతో మరో డీఎస్సీ నిరుద్యోగులు ఆందోళన చెందొద్దు: భట్టి

5 వేల పోస్టులతో మరో డీఎస్సీ నిరుద్యోగులు ఆందోళన చెందొద్దు: భట్టి
  • షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 18 నుంచి డీఎస్సీ పరీక్షలు
  •     ఇప్పటికే 2 లక్షల మందిహాల్ టికెట్లు డౌన్​లోడ్ చేసుకున్నరు
  •     ఉద్యోగాల భర్తీపై పకడ్బందీగా వ్యవహరిస్తున్నం
  •     పరీక్షలకు నిరుద్యోగులు సహకరించాలి
  •     పదేండ్లలో గత బీఆర్​ఎస్​ సర్కారు ఎన్నడూ గ్రూప్​–1 నిర్వహించలే 
  •     ప్రభుత్వం ఏర్పడ్డ మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలిచ్చామన్న డిప్యూటీ సీఎం

హైదరాబాద్, వెలుగు : త్వరలోనే 5 వేల పైచిలుకు పోస్టులతో మరో డీఎస్సీ వేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యం వృథా చేయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుండా డీఎస్సీకి ప్రిపేర్ కావాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అభ్యర్థులకు  సూచించారు. ఆదివారం గాంధీ భవన్​లో ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, రాందాస్ నాయక్, కార్పొరేషన్​ చైర్మన్లు అన్వేష్​రెడ్డి, రాయల నాగేశ్వర్​రావు, లోకేశ్​యాదవ్​తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.  

ఉద్యోగాల భర్తీపై తాము పకడ్బందీగా వ్యవహరిస్తున్నామని చెప్పారు.  అనేక ఉద్యమాలు, విద్యార్థుల ఆత్మబలిదానాల ఫలితమేప్రత్యేక రాష్ట్రమని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రం తెచ్చుకున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30 వేల మందికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చామని తెలిపారు. విద్యా వ్యవస్ధ బలోపేతం, పేద విద్యార్ధులకు మంచి చేయాలనే ఉద్దేశంతో గ్రూప్స్, డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని భట్టి వెల్లడించారు.  మరో 13,321 ఉద్యోగాల నియామక ప్రక్రియ చివరి దశకు చేరిందని,  ఇందులో గురుకుల పీఈటీ, అసిస్టెంట్ ఇంజినీర్లు, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్లు, లైబ్రేరియన్లు, జూనియర్ లెక్చరర్లు, మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయని తెలిపారు. 

జాబ్​ క్యాలెండర్​ విడుదల ప్రక్రియను వేగవంతం చేశామని భట్టి విక్రమార్క తెలిపారు. ‘‘రాష్ట్రంలో 16వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించాం. 11 వేల ఉపాధ్యాయ ఖాళీలను త్వరలో భర్తీ చేయబోతున్నాం. త్వరలో మరికొన్ని ఖాళీలతో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం.  మా ప్రభుత్వం తరచూ డీఎస్సీ  వేస్తూనే ఉంటుంది. గత ప్రభుత్వం నిరుడు సెప్టెంబర్ మాసంలో 5 వేల పోస్టుల‌తో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1,75,527 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఆ 5 వేల పోస్టుల‌కు, మరో 6000 కలిపి 11 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేషన్ ఇచ్చాం. మొత్తంగా 2.79 లక్షల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే 2  లక్షల 5 వేల మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తాం. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశాం” అని తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో 19,718  మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చామని, 34,000 మంది టీచర్ల బదిలీలు నిర్వహించామని వెల్లడించారు. 

త్వరితగతిన ఉద్యోగాలివ్వడమే మా లక్ష్యం

గత ప్రభుత్వం నిరుద్యోగులను గాలికొదిలేసిందని, పదేండ్లలో ఒక్కసారి కూడా  గ్రూప్– 1 నిర్వహించలేదని భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వంలో సీఎల్పీ నేతగా తాను పలుమార్లు ప్రభుత్వాన్ని అసెంబ్లీలో డిమాండ్ చేశానని, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా నోటిఫికేషన్ వచ్చిందని, అది కూడా పేపర్​ లీక్​తో రెండుసార్లు ప్రిలిమ్స్​నిర్వహించారని చెప్పారు. తమ ప్రభుత్వం రాగానే గత సర్కారు ఇచ్చిన నోటిఫికేషన్ ను రీ షెడ్యూల్ చేసి, విజయవంతంగా గ్రూప్​–1 ప్రిలిమ్స్​నిర్వహించినట్టు తెలిపారు.  మొత్తం 31 ,382 మంది  మెయిన్స్​కు ఎంపికయ్యారని, మెయిన్స్​షెడ్యూల్​ను కూడా రిలీజ్​ చేశామని చెప్పారు. గత సర్కారు ఓట్ల కోసం ఎన్నికలు ఉన్నాయని తెలిసి కూడా సెప్టెంబర్ లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని తెలిపారు. కొందరు ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తి, ధర్నాలు చేస్తున్నారని అన్నారు. గ్రూప్‌-–2ను ఇప్పటికే  3 సార్లు వాయిదా వేశారని, పరీక్షలు అన్ని సార్లు వాయిదా వేయడం సరికాదని చెప్పారు. 

ఉద్యోగాలిచ్చుడే మా టార్గెట్​

త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వడమే తమ సర్కారు లక్ష్యమని పేర్కొన్నారు. హాస్టల్‌  వెల్ఫేర్‌కి సంబంధించి 581 ఉద్యోగాలకు ఇటీవలే పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ఇదే చివరి డీఎస్సీ కాదని, మరిన్ని వేస్తామని హామీ ఇచ్చారు. డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులందరూ బాగా పరీక్షలు రాసి, ఉద్యోగం పొందాలని, త్వరితగతిన ప్రభుత్వ పాఠశాలల్లోని పేద బిడ్డలకు పాఠాలు చెప్పాలనేది తమ ప్రభుత్వం కోరికని చెప్పారు.