టిబెట్లో మళ్లీ భూకంపం..తీవ్రత 4..భయంతో వణికిన జిజాంగ్ ప్రాంతం

టిబెట్లో మళ్లీ భూకంపం..తీవ్రత 4..భయంతో వణికిన జిజాంగ్ ప్రాంతం

టిబెట్ లో మరోసారి భూకంపం వచ్చింది. బుధవారం (జనవరి 8, 2025) ఉదయం 06:58 గంటలకు జిజాంగ్‌ భూకంప కేంద్రంగారిక్టర్ స్కేల్‌పై 4 తీవ్రతతో భూకంపం సంభవించింది.  

మంగళవారం టిబెట్‌లో సంభవించిన భూకంపం 7.1 తీవ్రతతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భూకంపం ధాటికి 126 మందిని చనిపోయారు. వందలకొద్దీ ఇళ్లు నేలమట్టమయ్యాయి. భారీ విధ్వంసం తర్వాత మరోసారి భూకంపం రావడంతో జిజాంగ్ ప్రజలు భయంతో వణికిపోయారు. 

Also Read :- ఇస్రో కొత్త చైర్మన్గా వి.నారాయణన్

భూకంప కేంద్రం ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.2గా నమోదైన పొరుగున ఉన్న నేపాల్‌లో కూడా ప్రకంపనలు వచ్చాయి.