
నైపిడా: వరుస భూకంపాలు మయన్మార్‌ను గజగజ వణికిస్తున్నాయి. 2025 మార్చి 28వ తేదీన మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం ఆ దేశాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి ప్రజలు పూర్తిగా తేరుకోకముందే.. తాజాగా ఆదివారం (ఏప్రిల్ 13) ఉదయం మయన్మార్‌లోని మండలే ప్రాంతంలో మరో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.5గా నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) వెల్లడించింది.
మండలే ప్రాంతంలోని ఒక చిన్న నగరం మెయిక్టిలా సమీపంలో భూకంపం సంభవించినట్టుగా పేర్కొంది. మండలేకు దక్షిణంగా 97 కిలోమీటర్లు (60 మైళ్ళు) దూరంలో ఉన్న వుండ్‌విన్ టౌన్‌షిప్‌లో 20 కిలోమీటర్లు (12 మైళ్ళు) లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు తెలిపింది. మరోసారి భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
►ALSO READ | హిందూ ఫోబియాకు వ్యతిరేకంగా బిల్లు
ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో ఇళ్ల నుంచి రోడ్ల మీదకు పరుగులు తీశారు. భూకంపం సంభవించడంతో జనాలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. తాజా భూకంపం వల్ల చోటు చేసుకున్న ఆస్తి, ప్రాణ వివరాలు ఇప్పటికి అయితే అధికారులు వెల్లడించింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహయక చర్యలు చేపట్టారు.
కాగా, మార్చి 28న మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం వల్ల దాదాదపు 3,649 మంది మరణించారు. 5,000 మందికి పైగా గాయపడగా.. మరికొందరు తప్పిపోయారు. ఇదిలా ఉండగానే మరోసారి భూకంపం రావడంతో రావడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థంకాక మయన్మార్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.