ప్రకృతి పగ బట్టిందా.. ఒకటి తర్వాత ఒకటి.. వరస భూకంపాలు దడ పుట్టిస్తున్నాయి. 5 అంటే ఐదు గంటల్లో రెండోసారి భారీ భూకంపం వచ్చింది. 2025 జనవరి 7వ తేదీ మంగళవారం ఉదయం నేపాల్ కేంద్రంగా 7.1 తీవ్రతతో వచ్చిన భూకంపానికి వందల మంది చనిపోయారు.
ఆ తర్వాత కేవలం ఐదు గంటల్లోనే అంటే..ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో టిబెట్ కేంద్రంగా మరో భారీ భూకంపం వచ్చింది. దీని తీవ్రత 4.5గా రిక్టర్ స్కేల్ పై నమోదైంది. నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో ఐదు గంటల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు రావటంతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది.