ఛత్తీస్‎గఢ్‎లో మరో ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు హతం

ఛత్తీస్‎గఢ్‎లో మరో ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు హతం

రాయ్‎పూర్: ఛత్తీస్‎గఢ్‎లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో శనివారం (మార్చి 1) భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు  కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా, కిష్టారామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మాయిస్టులు ఉన్నారన్న సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్), -సీఆర్‎పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు సుక్మా పోలీస్ సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ తెలిపారు. ఈ క్రమంలో భద్రతా దళాలకు తారసపడ్డ మావోయిస్టులు కాల్పులు జరిపారు. 

ALSO READ : అమెరికాతో చర్చల విఫలం వెంటనే..: ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్ మిస్సెల్స్ దాడులు

దీంతో అప్రమత్తమైన జవాన్లు తిరిగి ఎదురు కాల్పులు జరిపారు. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. ఎన్‌కౌంటర్ స్థలం నుండి ఇప్పటివరకు ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ వెల్లడించారు. తాజా ఎన్‌కౌంటర్‌తో ఈ సంవత్సరం ఛత్తీస్‎గఢ్‎లో ఇప్పటివరకు జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్లలో 83 మంది నక్సలైట్లు హతమైనట్లు అధికారులు తెలిపారు. వారిలో 67 మంది సుక్మా, బస్తర్‎తో పాటు ఏడు జిల్లాలకు చెందిన వారు ఉన్నారని చెప్పారు.