జమ్మూకాశ్మీర్‎లో మరో ఎన్ కౌంటర్.. ఇద్దరు జవాన్లు మృతి

జమ్మూకాశ్మీర్‎లో మరో ఎన్ కౌంటర్.. ఇద్దరు జవాన్లు మృతి

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‎లో ఎన్ కౌంటర్ జరిగింది. కిశ్త్ వాడ్ జిల్లాలో భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు చనిపోయారు. కిశ్త్ వాడ్‎లోని ఛత్రూలో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో జమ్మూకాశ్మీర్ పోలీసులతో కలిసి ఆర్మీ శుక్రవారం ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో భద్రతా బలగాలపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతున్నదని ఆర్మీ అధికారులు తెలిపా రు. కాగా, జమ్మూకాశ్మీర్​లోని ఖతువాలో జరిగిన మరో ఎన్​కౌంటర్‎లో ఇద్దరు టెర్రరిస్టులను రైజింగ్​స్టార్​ కోర్‎కు చెందిన భద్రతా బలగాలు కాల్చి చంపాయి.