జమ్మూ కాశ్మీర్‎లో మరో ఎన్ కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

జమ్మూ కాశ్మీర్‎లో మరో ఎన్ కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

శ్రీనగర్: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న వేళ జమ్మూ కాశ్మీర్‎లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఇవాళ (సెప్టెంబర్ 28, 2024) కుల్గామ్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు భద్రతా దళాల చేతిలో హతం కాగా.. టెర్రరిస్టుల కాల్పుల్లో పోలీసు అధికారితో సహా జవాన్లు సిబ్బంది గాయపడ్డట్లు అధికారులు వెల్లడించారు. కుల్గామ్‌లోని అదిగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతోన్నట్లు తెలిపారు. టెర్రరిస్టుల కాల్పుల్లో గాయపడ్డవారిని కుల్గాం అదనపు ఎస్పీ ముంతాజ్ అలీ భట్టి, రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన సిపాయిలు మోహన్ శర్మ, సోహన్ కుమార్, యోగిందర్, మహ్మద్ ఇస్రాన్‌లుగా గుర్తించారు. 

ALSO READ | దేశ రాజధానిలో దారుణం.. నలుగురు కూతుర్లను చంపి తండ్రి ఆత్మహత్య

చనిపోయిన ఉగ్రవాదుల వివరాల సేకరిస్తున్నామని తెలిపారు. కాగా, కుల్గామ్‌లోని అదిగామ్ గ్రామంలో ఉగ్రవాదుల నక్కి ఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాల సమాచారంతో సైన్యం, పోలీసులు, సీఆర్‎పీఎఫ్ సహా భద్రతా దళాలు ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ అపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు, భద్రతా దళాలు తారసపడగా.. జవాన్లపై టెర్రరిస్టులు కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన సైనికులు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు చేశారు. ఈ ఫైరింగ్‎లో చేతిలో ఇద్దరు టెర్రరిస్ట్ మూకలు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. ఘటన స్థలంలో ఎన్ కౌంటర్ కొనసాగుతోందని పేర్కొన్నారు.