మంచు ఫ్యామిలీలో చక్కెర లొల్లి.. మళ్లీ గొడవ పడ్డ విష్ణు, మనోజ్

మంచు ఫ్యామిలీలో చక్కెర లొల్లి.. మళ్లీ గొడవ పడ్డ విష్ణు, మనోజ్

బడంగ్ పేట, వెలుగు: సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో గొడవలు సద్దుమణగడం లేదు. మంచు మనోజ్, విష్ణు మరోసారి గొడవపడ్డారు. జల్ పల్లిలోని తన ఇంటికి వచ్చిన విష్ణు.. జనరేటర్‎లో చక్కెర కలిపిన డీజిల్ పోశారని మనోజ్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాకు లేఖ విడుదల చేశారు. ‘‘నా తల్లి జన్మదిన వేడుకల సందర్భంగా శనివారం రాత్రి విష్ణుతో పాటు అతని అనుచరులు నా ఇంట్లోకి ప్రవేశించారు. కేక్ కట్ చేసే సమయంలో జనరేటర్‎లో చక్కెర కలిపిన డీజిల్ పోశారు. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మేం రాత్రంతా బిక్కుబిక్కుమంటూ నిద్రపోలేదు. నన్ను చంపేందుకు కుట్ర జరుగుతున్నది” అని అందులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.