ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో కెన్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో కార్మికులు,స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రమాదానికి గల కారణాలపై ఆరాదీస్తున్నారు.
పరవాడ ఫార్మాసిటీలో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలపై కార్మికులు,స్థానికులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే 2024 నవంబర్ 2, డిసెంబర్ 22 తేదీల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. మళ్లీ నెల రోజులు కూడా గడవకుండానే మరో అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది.