
సియోల్: దక్షిణ కొరియాలో ఆదివారం నాటి ఘోర విమాన ప్రమాదం ఘటన తర్వాత రోజే మరో విమానంలో సమస్య తలెత్తడం తీవ్ర ఆందోళన కలిగించింది. అది కూడా జెజు ఎయిర్ సంస్థకు చెందిన సేమ్ బోయింగ్మోడల్ విమానంలోనే ల్యాండింగ్ గేర్ సమస్యే తలెత్తడం అందర్ని హడలెత్తించింది. సోమవారం సియోల్‌లోని గింపో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి జెజు ఎయిర్‌కు చెందిన బోయింగ్ ఫ్లైట్ 7C101.. జెజు ద్వీపానికి ఉదయం 6:37 గంటలకు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండింగ్ గేర్‌లో సమస్య ఉన్నట్టు కెప్టన్ గుర్తించారు. దీంతో విమానాన్ని వెంటనే సియోల్‌లోని గింపో ఎయిర్‌పోర్టుకు తిరిగి వచ్చి ల్యాండ్ అయింది. ఈ సమయంలో విమానంలో 21 మంది ప్రయాణికులు ఉన్నారు.