మార్కెట్లో ఫోల్డ్ ఫోన్‌ల హవా కొనసాగుతోంది. మొబైల్ వినియోగదారులు కూడా వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మొబైల్ కంపెనీల్లో శాంసంగ్ గెలాక్సీఫోల్డ్ పేరుతో మొదటగా ఫోల్డ్ ఫోన్‌ను విడుదల చేసింది. తాజాగా మరో ఫోన్‌ను లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. హువావే, మోటరోలా కూడా త్వరలో ఫోల్డ్ ఫోన్లను తీసుకురానున్నట్లు ప్రకటించాయి.
ఈ క్రమంలోనే మరో సరికొత్తగా లేటెస్ట్ టెక్నాలజీతో ఫోల్డ్ ఫోన్ విడదుల చేయనున్నామని శాంసంగ్ డెవలపర్స్ సదస్సులో కంపెనీ ప్రకటించింది. కొత్త మోడల్ ఫోన్ పొడవాటి డిస్ప్లే.. నిలువుగా మడతబెట్డే విధంగా తయారు చేస్తున్నట్లు తెలిపింది. మోటరోలా ఈ నెల 13న లాంచ్ చేయనున్న ఫోల్డబుల్ ఫోన్ ‘మోటరోలా రాజర్’ తరహాలో దీన్ని రూపొందించింది. మోడల్ నెంబర్ SM-F700Fగా పిలిచే ఈ ఫోన్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది.