న్యూఢిల్లీ : ఐపీఎల్‌కు మరో ఫారిన్ క్రికెటర్ దూరమయ్యాడు. సౌతాఫ్రికా పేసర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు లుంగి ఎంగిడి గాయం కారణంగా ఈ సీజన్ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేక్ ఫ్రేసర్ మెక్‌గర్క్‌ను టీమ్‌లోకి తీసుకున్నట్టు ఢిల్లీ ఫ్రాంచైజీ శుక్రవారం ప్రకటించింది.
మెల్‌బోర్న్‌కు చెందిన 21 ఏండ్ల మెక్‌గర్క్ ఓపెనర్‌గా హిట్టింగ్ చేయడంతో పాటు లెగ్ స్పిన్నర్‌గానూ రాణిస్తున్నాడు. గత నెలలో వెస్టిండీస్‌పై వన్డే అరంగేట్రం చేశాడు. రూ. 50 లక్షల రిజర్వ్ ప్రైస్‌తో అతడిని ఢిల్లీ తమ టీమ్‌లో చేర్చుకుంది.