లింగ వివక్షకు మరో రూపం పింక్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ : బుర్ర మధుసూదన్ రెడ్డి

లింగ వివక్షకు మరో రూపం పింక్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ : బుర్ర మధుసూదన్ రెడ్డి

గూడ్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌, ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌,  ప్రాపర్టీ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌, కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌, కస్టమ్స్ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌, ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌, సేల్స్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ లాంటి అనేక రకాలైన పన్నులు లేదా ట్యాక్సుల గురించి విన్నాం.  నేడు ప్రపంచవ్యాప్తంగా మహిళలపట్ల  వివక్షకు మరో ఉదాహరణగా ‘పింక్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌’ అనే మాట వింటున్నాం.  నిత్య జీవితంలో దాని ప్రభావాన్ని అనుభవిస్తున్నాం. అసమానతల చట్రంలో విలవిల్లాడుతున్న మహిళలు అసాధారణ అణచివేతకు గురవుతున్నారు. లింగ వివక్ష విషవలయంలో  మహిళలు చిక్కి ద్వితీయ శ్రేణి  పౌరులుగా బతుకులు ఈడ్చుతుండడం విచారకరం, ఆక్షేపణీయం.  ఇదే కోవలో మరో విస్ఫోటన అంశం ‘పింక్‌‌‌‌‌‌‌‌ టాక్స్‌‌‌‌‌‌‌‌’ రూపంలో  స్త్రీజాతిని వెంటాడుతున్నది.

మహిళలు/ బాలికల డ్రెస్‌‌‌‌‌‌‌‌ మెటీరియల్‌‌‌‌‌‌‌‌,  పిల్లల బొమ్మలు (టాయిస్‌‌‌‌‌‌‌‌), మహిళా ఆరోగ్య పరిరక్షణ ఉత్పత్తులు,  మేకప్‌‌‌‌‌‌‌‌ కిట్స్‌‌‌‌‌‌‌‌, హెయిర్‌‌‌‌‌‌‌‌ సెలూన్‌‌‌‌‌‌‌‌ సేవలు లాంటి రంగాల్లో  ధరలు పురుషులతో  పోల్చితే.. మహిళలకు పింక్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ రూపంలో 10 నుంచి 40 శాతం వరకు అధిక ధరలు ఉంటున్నాయి.  పింక్ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివక్ష యూకే,  ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, యూఎస్‌‌‌‌‌‌‌‌ లాంటి పలు అభివృద్ధి చెందిన దేశాల్లో అధికంగా కనిపిస్తున్నది.  ఒక్క న్యూయార్క్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోనే  దాదాపు 100  కంపెనీలకు  చెందిన  800 మహిళా ఉత్పత్తులు/ సేవలకు అధిక ధరలు ఉండడం  గమనించారు. ఇలాంటి లింగ వివక్ష వర్గానికి  చెందిన ‘పింక్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌’ నేటి భారత డిజిటల్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో బహుళ ప్రచారంలోకి వస్తున్నది.  

పురుషుల కంటే మహిళల హెయిర్‌‌‌‌‌‌‌‌ కటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడానికి 60 శాతం అధిక ఖర్చు అవుతున్నది. పురుషుల హెయిర్‌‌‌‌‌‌‌‌ కటింగ్‌‌‌‌‌‌‌‌కు రూ.100  నుంచి- 200 వరకు వసూలు చేస్తే మహిళల హెయిర్‌‌‌‌‌‌‌‌ కటింగ్‌‌‌‌‌‌‌‌ నిమిత్తం రూ. 500  నుంచి- 800- ఖర్చు అవుతున్నది.  పురుషుల డీయోడరెంట్‌‌‌‌‌‌‌‌కు రూ.120-, మహిళల  డీయోడరెంట్‌‌‌‌‌‌‌‌కు  రూ. 150- వరకు ఖర్చు అవుతున్నది.  ఫ్యాషన్‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీలో పింక్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ వివక్ష విపరీతంగా కనిపిస్తున్నది. పురుషులు వాడుకునే ‘లిప్‌‌‌‌‌‌‌‌ బామ్’కు  రూ.165- ధర పలికితే  మహిళలు వాడే ‘లిప్‌‌‌‌‌‌‌‌ బామ్‌‌‌‌‌‌‌‌’ ధర  రూ.250- వరకు ఉంటున్నది.  

బాలుడితో పోల్చితే బాలిక స్కూల్‌‌‌‌‌‌‌‌ యూనిఫాంకు 12 శాతం, బాలికల బొమ్మలు/ కాస్మొటిక్స్‌‌‌‌‌‌‌‌/ డ్రెస్సులకు 37 శాతం వరకు అధిక ధరలు వెచ్చించవలసి వస్తున్నది.  కొన్ని ప్రాంతాల్లో రేజర్స్ ‌‌‌‌‌‌‌‌ఉత్పత్తులు,  డ్రైక్లీనింగ్‌‌‌‌‌‌‌‌ సేవలకు దాదాపు 50 శాతం వరకు అధిక ధరలు మహిళల నుంచి వసూలు చేయడం జరుగుతున్నది. బ్లూ బ్లేడ్స్‌‌‌‌‌‌‌‌ ధరలు రూ. 30- ఉన్నప్పుడు  పింక్‌‌‌‌‌‌‌‌ బ్లేడ్స్‌‌‌‌‌‌‌‌ ధరలు రూ.60- వరకు ఉంటున్నాయి.  మహిళలు వాడే షాంపూలు, సబ్బులు, డీయోడరెంట్స్‌‌‌‌‌‌‌‌, మేకప్‌‌‌‌‌‌‌‌ మెటీరియల్స్‌‌‌‌‌‌‌‌,  బ్యూటీ పార్లర్‌‌‌‌‌‌‌‌ సేవలు లాంటి అంశాల్లో  పింక్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ అధిక ప్రభావాలను చూపుతున్నది.

పింక్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తులు / సేవలను బహిష్కరిద్దాం

 పురుషుల ఉత్పత్తుల కన్నా  స్త్రీ ఉత్పత్తులకు అధిక ధరలు వసూలు చేయడాన్ని వివక్షగా భావించి అలాంటి వస్తువులు/ సేవలను బాయ్‌‌‌‌‌‌‌‌కాట్‌‌‌‌‌‌‌‌ చేయాలి.  దీనిపై మహిళలు ఉద్యమాలను నడపడం కూడా చూస్తున్నాం. ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, స్వేచ్ఛ అసమానతలు, ఉద్యోగ ఉపాధుల్లో అసమానతలు, నిర్ణయాధికార అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయి. అనాదిగా లింగ వివక్ష రూపంలో స్త్రీ సమాజాన్ని పట్టి పీడించడం చూస్తున్నాం. గతంతో  పోల్చితే నేడు లింగ వివక్ష కొంత తగ్గినప్పటికి  నేటికీ ఈ సమస్య సమాజాన్ని పీడిస్తూనే ఉన్నది. 

భారత్‌‌‌‌‌‌‌‌లో 23 శాతం ప్రజలు మాత్రమే పింక్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ పట్ల కొంతమేరకు అవగాహన కలిగి ఉన్నారు.  లింగ వివక్షకు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తున్న పింక్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ను  ప్రపంచ దేశాల ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి కూడా పిలుపును ఇచ్చే స్థాయికి చేరడం సమస్య గంభీరతను సూచిస్తున్నది.  నేడు ప్రముఖ సామాజిక కార్యకర్త కిరణ్‌‌‌‌‌‌‌‌ మజుందార్‌‌‌‌‌‌‌‌ షా లాంటి మహిళలు పింక్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ వసూళ్లకు వ్యతిరేకంగా గళమెత్తడం ఆహ్వానించదగిన పరిణామం. లింగవివక్షపై ఉద్యమించేవారిని ప్రోత్సహిస్తూ, ఇలాంటి ఉద్యమాల్లో మనం కూడా పిడికిలి బిగిద్దాం, లింగ వివక్షను వ్యతిరేకిస్తూ,  సమ సమాజాన్ని నిర్మించడానికి చేయూతను ఇద్దాం.

పింక్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌  అంటే ఏమిటి?

పింక్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం వసూలు చేసే ఏ విధమైన పన్ను కాదు.  ఇది కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ లేదా మహిళా వినియోగ వస్తు ఉత్పత్తిదారులు లేదా కంపెనీలు లేదా వ్యాపార వర్గాలు.. మహిళాదరణ ఆధారంగా వసూలు చేసే అధిక ధరలు. ఒకే కంపెనీ తయారు చేసిన ఒకే రకమైన ఉత్పత్తులు/సేవలకు  పురుషుల కంటే మహిళలు వినియోగించే ఉత్పత్తులు/సేవలకు  వేరు వేరు ధరలు పలకడం చూస్తున్నాం. 

పురుష ఉత్పత్తులు/ సర్వీసులతో పోల్చితే మహిళ ల ఉత్పత్తులు/ సర్వీసులకు అధిక ధరలను విధించడాన్ని ‘పింక్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌’ అని అంటున్నారు. ‘పింక్‌‌‌‌‌‌‌‌ రంగు’ మహిళలను,  ‘బ్లూ రంగు’ పురుషులను ప్రతిపాదిస్తున్న విషయం మనకు తెలుసు.  మహిళల ఉత్పత్తులు/ సేవలకు అధిక ధరలు ఉన్నప్పుడు ‘పింక్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్’‌‌‌‌‌‌‌‌ అని,  పురుషుల ఉత్పత్తులు/ సేవలకు అధిక ధరలు ఉన్నప్పుడు ‘బ్లూ ట్యాక్స్’‌‌‌‌‌‌‌‌ అని పిలుస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా నేడు  ‘పింక్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్’ మాత్రమే మార్కెట్‌‌‌‌‌‌‌‌లో  వేగంగా దావానలంలా వ్యాపిస్తున్నది. 

- డా: బుర్ర మధుసూదన్ రెడ్డి, ఎనలిస్ట్