
న్యూఢిల్లీ: వరల్డ్ డెఫ్ షూటింగ్‌చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌షూటర్‌ధనుశ్‌శ్రీకాంత్‌మూడో గోల్డ్ నెగ్గాడు. జర్మనీలోని హనోవెర్‌లో మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్‌టీమ్ ఫైనల్లో శ్రీకాంత్–మోహిత్ సంధు 17–5 స్కోరుతో ఇండియాకే చెందిన నటాషా జోషి–మొహమ్మద్ మూర్తజాపై గెలిచింది. నటాషా, మూర్తజాకు సిల్వర్ లభించింది. కాగా, ధనుశ్‌ఇప్పటికే 10 మీ. ఎయిర్‌రైఫిల్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్‌లోనూ స్వర్ణాలు సొంతం చేసుకున్నాడు.