తెలంగాణ ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీపై రైతులకు మరో శుభవార్త చెప్పింది. జూలై 16న అధికారులతో చర్చించి రూ.లక్షలోపు ఉన్న పంట రుణాలను జూలై 18న మాఫీ చేస్తామని ప్రకటించారు. బుధవారం మిగిలిన రుణమాఫీని రెండు దశల్లో డబ్బులు చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రూ.లక్ష వరుకు తీసుకున్న పంట రుణాలను జూలై 18న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. రూ.లక్షన్నర వరకు తీసుకున్న క్రాప్ లోన్స్ జూలై చివరి కల్లా రుణమాఫీ చేస్తామని బుధవారం ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్ట్ మొదటి వారంలోపు పూర్తిగా రెండు లక్షల లోపు పంట రుణలు తీసుకున్న రైతులకు క్రాప్ లోన్స్ మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ALSO READ | Rythu Runa Mafi : రైతు రుణమాఫీ గురించి 20 సంవత్సరాలు చెప్పుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి
పేదలకు మహా లక్ష్మి (ఫ్రీ బస్) పథకం కింద 62 కోట్ల మంది ప్రయాణికులు లబ్ది పొందారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గృహ జ్యోతి 200 యూనిట్ల లబ్ది స్కీం 46 లక్షల గృహాలకు అందుతుందన్నారు. 500 కే సిలిండర్ కు ఇచ్చేందుకు రూ.200 కోట్లు, రైతు భీమ రూ.734 కోట్లు ఖర్చు చేశామన్నారు ముఖ్యమంత్రి. ఇప్పటి వరకు మొత్తం సంక్షేమ పథకాల కోసం రూ.29 వేల కోట్లు కేటాయించామని వివరించారు.