తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సావిత్రి బాయి పూలే జయంతి జనవరి 3వ తేదీని మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా డిక్లేర్ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి గురువారం (జనవరి 2) ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ప్రతి ఏడాది జనవరి 3వ తేదీన  మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి ఏటా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోందని స్పష్టం చేశారు. 

ఈ వేడుకలకు విద్యా శాఖ నుండి బడ్జెట్ కేటాయించాలని పేర్కొన్నారు. విద్యతోనే వనితకు విముక్తి సాధ్యమన్న సామాజిక సంస్కర్త, ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, బహుజన చైతన్య స్ఫూర్తి మహాత్మ జ్యోతిరావు పూలే సతీమణి గౌరవ సావిత్రిబాయి పూలే జయంతి (జనవరి 3)ని "మహిళా ఉపాధ్యాయ దినోత్సవం"గా జరపాలని నిర్ణయించామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.