ఉక్రెయిన్‌లో భారత విద్యార్థికి బుల్లెట్ గాయాలు

ఉక్రెయిన్‌లో భారత విద్యార్థికి బుల్లెట్ గాయాలు

ఉక్రెయిన్ యుద్ధ కల్లోలంలో మరో భారత విద్యార్థి ప్రాణాపాయంలో చిక్కుకున్నాడు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సిటీ నుంచి బయటకు పడేందుకు ప్రయత్నిస్తుండగా.. ఇండియన్ స్టూడెంట్ పై కాల్పులు జరిగాయి. దీంతో బుల్లెట్ గాయాలైన ఆ విద్యార్థిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థి ఢిల్లీ సమీపంలోని ఛాత్రపూర్ కు చెందిన హర్జోత్ సింగ్ అని గుర్తించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ ధ్రువీకరించారు. కీవ్ నుంచి ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకునేందుకు బయలుదేరిన భారత విద్యార్థిపై కాల్పులు జరిగినట్లు తనకు సమాచారం అందిందని ఆయన చెప్పారు. ఆ స్టూడెంట్ ను వెంటనే ఆస్పత్రిలో చేర్చారన్నారు. కీవ్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో టాప్ ప్రయారిటీతో అక్కడి వారిని వేగంగా తరలిస్తున్నామని వీకే సింగ్ చెప్పారు. యుద్ధం జరుగుతున్న సమయంలో ఏ ఒక్క దేశం వారినో, ఏ ఒక్క మతం వారినో టార్గెట్ చేసి ఒక గన్ బుల్లెట్ దూసుకురావడం జరగదని ఆయన అన్నారు. ఈ ఘటన జరగకుంటే ఆ విద్యార్థి పోలాండ్ సరిహద్దుకు చేరుకోవాల్సిందని చెప్పారు.

కాగా, ఉక్రెయిన్ లోని ఖార్కివ్ సిటీలో మూడ్రోజుల క్రితం రష్యా బాంబు దాడుల్లో కర్ణాటకకు చెందిన నవీన్ శేఖరప్ప అనే మెడికల్ స్టూడెంట్ మరణించాడు. ఖార్కివ్ లో ఉంటున్న ఆ విద్యార్థి స్టోర్ కు వెళ్తుండగా దాడి జరగడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

మరిన్ని వార్తల కోసం..

ఉక్రెయిన్​ యుద్ధంతో రష్యా ఏకాకిగా మారిందా?

సినిమా రిలీజ్ కాకుండా స్టే ఇవ్వలేం

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్ డేట్స్