హైటెక్ సిటీలో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ
బ్యాక్ డోర్ జాబ్స్ పేరుతో సోషల్ మీడియాలో ప్రకటనలు
ఒక్కొక్కరి నుంచి రూ.3.5 లక్షల వరకు వసూలు
200 మందికి పైగా బాధితులు
మదాపూర్ పీఎస్ పరిధిలో ఫిర్యాదు
మాదాపూర్, వెలుగు : హైటెక్‌సిటీలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. ముందుగా లక్షల్లో డబ్బులు వసూలు చేసి.. నెల రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి.. నెలకు రూ.20 వేల చొప్పున జీతం ఇచ్చి నమ్మకం కల్గించిన తర్వాత బోర్డు ఎత్తేసింది. దీంతో డబ్బులు చెల్లించిన వారంతా రోడ్డున పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యునైటెడ్ అలయన్స్ టెక్నాలజీ కంపెనీ పేరుతో కొండాపూర్ఏఎంబీ ఎదురుగా ఉన్న బిల్డింగ్‌లో ఆఫీస్ ఓపెన్ చేశారు. బ్యాక్డోర్జాబ్స్అంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చారు. అది చూసి ఫోన్‌చేసిన సుమారు 200 మందికి పైగా నిరుద్యోగ యువతీ యువకులకు సాఫ్ట్వేర్జాబ్స్ఇస్తామని కంపెనీకి డైరెక్టర్‌గా చెప్పుకున్న అమన్, పవన్కుమార్అలియాస్ నవీన్‌కుమార్ అనే వ్యక్తులు నమ్మబలికారు. ఆఫర్ లెటర్వచ్చాక మూడు నెలలు ట్రైనింగ్ ఇస్తామని, ఇంటి నుంచే (వర్క్‌ఫ్రం హోం) హాజరుకావొచ్చని చెప్పారు. ట్రైనింగ్సమయంలో నెలకు రూ.20 వేలు జీతం ఇస్తామని పేర్కొన్నారు. డిసెంబర్లో హైదరాబాద్, పుణె నుంచి హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌నుంచి అంటూ ఇద్దరు మహిళలు ఫోన్లోఇంటర్వ్యూ నిర్వహించారు. ఇంటర్య్వూ కంప్లీట్ అయ్యాక సంవత్సరానికి రూ.4.50 లక్షల జీతం ఇస్తామని, ఆఫర్ లెటర్ మెయిల్చేస్తామని, జాబ్‌లో జాయిన్అయ్యాక తమకు డబ్బులు ఇవ్వాలని సూచించారు. అనంతరం డిసెంబర్ నెలాఖరులో పుణె, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో కంపెనీ బ్రాంచ్‌లు ఉన్నాయని ఫేక్ఆఫర్లెటర్స్, ఐడీ కార్డులు, ల్యాప్‌టాప్‌లు ఇచ్చారు. ఆ తర్వాత ఒక్కొక్కరి నుంచి లక్షా 50 వేల నుంచి 3 లక్షల 50 వేల చొప్పున వసూలు చేశారు.
ఎలా బయటపడిందంటే..
జనవరి నెల ట్రైనింగ్కంప్లీట్అయ్యాక ఫిబ్రవరిలో రూ.20 వేల చొప్పున అందరికీ జీతాలు ఇచ్చారు. ఫిబ్రవరి నెల పూర్తయిన తర్వాత మార్చి మొదటి వారంలో జీతాలు రాలేదు. దీంతో అమన్, పవన్ కుమార్ లకు ఫోన్ చేయగా రెస్పాండ్కాలేదు. ఆఫీస్‌కు వెళ్లి చూడగా అక్కడ ఎవరూ లేదు. దీంతో మోసపోయినట్టు గ్రహించిన బాధితులు మాదాపూర్పోలీసులను ఆశ్రయించారు. అంతేకాకుండా డబ్బులు వసూలు చేసిన కంపెనీ డైరెక్టర్అమన్, పవన్ఒక్కరేనని బాధితులు చెబుతున్నారు. బాధిత యువతీ యువకులందరూ బీటెక్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ కంప్లీట్అయ్యి జాబ్స్కోసం సెర్చ్చేస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. ఉద్యోగం కోసం వీరందరూ ఇంట్లో తెలియకుండా అప్పులు తెచ్చి మరీ డబ్బులు కట్టినట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.