ఐఏఎస్ అమోయ్ కుమార్పై మరో భూ కుంభకోణం ఫిర్యాదు

ఐఏఎస్ అమోయ్ కుమార్పై మరో భూ కుంభకోణం ఫిర్యాదు

హైదరాబాద్: ఐఏఎస్ అమోయ్ కుమార్పై మరో భూ కుంభకోణం ఫిర్యాదు నమోదైంది. రంగారెడ్డి జిల్లా తట్టి అన్నారం గ్రామం, మధురానగర్ కాలనీ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో బషీర్ బాగ్లోని ఈడీ కార్యాలయంలో అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు, ఎల్బీనగర్ కాంగ్రెస్ నాయకుడు రామ్మోహన్ గౌడ్ , ఉపాధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్ గిరి కంటెస్టెడ్ ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బాధితులు ఫిర్యాదు చేశారు. 

దాదాపు 1000 కోట్ల రూపాయల విలువ జేసే భూములను మాయం చేశారని అమోయ్ కుమార్పై ఆరోపణలున్నాయి. ఈ భూ కుంభకోణం కేసులో ఐఏఎస్ అమోయ్ కుమార్ ఇప్పటికే ఈడీ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 

Also Read : హైదరాబాద్ సిటీలో రెండు డ్రగ్స్ ముఠాలు అరెస్ట్

బీఆర్‌‌‌‌ఎస్ హయాంలో జరిగిన భూ కేటాయింపుల కేసులో రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్‌‌‌‌ అమోయ్‌‌ కుమార్‌‌ బుధవారం‌‌ ఈడీ ముందు విచారణకు హాజయ్యారు. తన అడ్వొకేట్​తో కలిసి బషీర్‌‌‌‌బాగ్‌‌లోని ఈడీ ఆఫీస్​కు వెళ్లారు. 10.30 గంటల నుంచి సాయంత్రం ఐదున్నర దాకా ఈడీ జాయింట్‌‌ డైరెక్టర్ రోహిత్‌‌ ఆనంద్‌‌ నేతృత్వంలోని స్పెషల్ టీమ్ అమోయ్ కుమార్​ను విచారించింది. 

రంగారెడ్డి, మేడ్చల్‌‌ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో గతంలో జరిగిన భూ కేటాయింపులపై అధికారులు ఆరా తీశారు. ప్రధానంగా మహేశ్వరం మండలం నాగారం గ్రామ పంచాయతీ పరిధిలోని 50 ఎకరాల భూదాన్‌‌ భూ వివాదం కేసుపై ప్రశ్నించారు. ల్యాండ్ రికార్డుల ఆధారంగా అమోయ్‌‌ కుమార్ స్టేట్‌‌మెంట్​ను రికార్డు చేశారు. ‌‌మళ్లీ గురువారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.