భ్రమరాంబా సమేతుడై శివుడు వెలసిన నేల శ్రీశైలంలో మరో శివ లింగం బయటపడింది. యాఫి ధియేటర్ సమీపంలో సీసీ రోడ్డు సపోర్ట్ వాల్ నిర్మాణానికి జేసీబీతో చదును చేస్తుండగా పురాతన శివలింగం దర్శనమిచ్చింది. శివలింగంతో పాటు అదే రాయిపై నంది విగ్రహం కూడా ఉండటం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. శివలింగం పక్కనే రాయిపై కొన్ని గుర్తులతో.. తెలియని లిపితో కొంత రాసి ఉంది.
బయటపడిన శివలింగం వద్దకు జనం వేగంగా వచ్చి దర్శించుకోవడం స్టార్ట్ చేశారు. పూలు పండ్లు పెట్టడం వంటివి చేశారు. విషయం తెలుసుకున్న శ్రీశైల దేవస్థాన అధికారులు శివలింగం వద్దకు వచ్చి పరిశీలించారు. పురావస్తు శాఖ అధికారులు చేరుకుని లిపిని ఆర్కియాలజీ ల్యాబ్ కు పపించారు.